'ఎన్నారై టీఆర్ఎస్ యూకే' ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-10T21:58:01+05:30 IST

కరోనా లాక్ డౌన్ కారణంగా యూకేలో ఇబ్బంది పడుతున్న ప్రవాస విద్యార్థులకు

'ఎన్నారై టీఆర్ఎస్ యూకే' ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

హైదరాబాద్: కరోనా లాక్ డౌన్ కారణంగా యూకేలో ఇబ్బంది పడుతున్న ప్రవాస విద్యార్థులకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రవాసులకు కాకుండా క్షేత్రస్థాయిలో పేదలకు కూడా సేవ చేస్తూ ఎన్నారై టీఆర్ఎస్ యూకే గొప్ప మనసు చాటుకుంటోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో ఎన్నారై టీఆర్ఎస్ సభ్యుడు (షఫిల్డ్ పట్టణం) అరవింద్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా నేడు వందకు పైగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. ఎన్నారై టీఆర్ఎస్ యూకే విభాగం అక్కడున్న విద్యార్థులకే కాకుండా మాతృభూమిపై ఉన్న బాధ్యతతో ఇక్కడున్న పేదలకు కూడా సేవలందించడం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు. కుత్భుల్లాపూర్ వాసి అయిన అరవింద్ రెడ్డి తాను పుట్టినగడ్డను మర్చిపోకుండా తన వంతు బాధ్యతగా వందకు పైగా పేదలకు సహాయం అందించడాన్ని అభినందిస్తున్నానన్నారు. కాగా.. తాము పిలవగానే కార్యక్రమానికి హాజరై ప్రోత్సహించిన ఎమ్మెల్యే వివేకానంద్‌కు, స్థానిక కార్పొరేటర్ వీరేందర్ రెడ్డికి, ఎన్నారై టీఆర్ఎస్ ఇండియా కోఆర్డినేటర్ మల్లేష్ పప్పుల, స్థానిక టీఆర్ఎస్ నాయకులకు, దాతలు అరవింద్ రెడ్డికి వారి తల్లితండ్రులకు ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఫోన్ ద్వారా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. యూకేలోని షఫిల్డ్ పట్టణంలో స్థానిక కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్నారై టీఆర్ఎస్ సభ్యులు, నిత్యావసర సరుకుల దాత అరవింద్ రెడ్డి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే వివేకానందకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గానికి, అనిల్ కూర్మాచలంకు, స్థానిక వివిధ డివిజన్ నాయకులు సుధాకర్, ఆగం రాజు, ఆగం పండు, బాలాజీ నాయక్‌లతో పాటు స్థానిక నాయకులు సమ్మెట వెంకన్న బాబు, వెంకటేష్ పటేల్, సుధాకర్ రెడ్డి తదితరులకు కృతఙ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-05-10T21:58:01+05:30 IST