'పెళ్లి నాతో.. కాపురం మాత్రం నా ఫ్రెండ్‌తో'.. ఎన్నారై భ‌ర్త నిర్వాకం

ABN , First Publish Date - 2020-07-28T13:55:21+05:30 IST

ఒక్కగానొక్క కూతురును రూ.50 లక్షలు కట్నం, 55 సవర్ల బంగారం ఇచ్చి ఎన్‌ఆర్‌ఐతో పెళ్లి చేస్తే.. ‘నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు. నిన్ను నా బాయ్‌ ఫ్రెండ్‌కు అప్పగించడం కోసమే పెళ్లి చేసుకున్నా’ అంటూ పెళ్లయిన రెండో రోజే ఆ ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకు భార్యకు షాకిచ్చాడు.

'పెళ్లి నాతో.. కాపురం మాత్రం నా ఫ్రెండ్‌తో'.. ఎన్నారై భ‌ర్త నిర్వాకం

బాయ్‌ ఫ్రెండ్‌ కోసమే పెళ్లి.. పెళ్లయిన రెండోరోజే భార్యకు షాక్‌

పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు 

గుంటూరు, జూలై 27: ఒక్కగానొక్క కూతురు ఎన్‌ఆర్‌ఐను పెళ్లి చేసుకొని అమెరికాలో సుఖపడుతుందని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అయితే వారి కలలు కల్లలయ్యాయి. రూ.50 లక్షలు కట్నం, 55 సవర్ల బంగారం ఇచ్చి ఎన్‌ఆర్‌ఐతో పెళ్లి చేస్తే.. ‘నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు. నిన్ను నా బాయ్‌ ఫ్రెండ్‌కు అప్పగించడం కోసమే పెళ్లి చేసుకున్నా’ అంటూ పెళ్లయిన రెండో రోజే ఆ ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకు భార్యకు షాకిచ్చాడు. ఆ తర్వాత రెండు నెలలకు.. చెప్పాబెట్టకుండా భార్యను వదిలేసి అమెరికా చెక్కేశాడు. దీంతో..  మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. తల్లిదండ్రులతో కలిసి సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. గుంటూరు ఏటి అగ్ర హారంలో ఉంటున్న దంపతులకు ఒకే ఒక్క కుమార్తె. ఆమెను బీటెక్‌ చదివించారు.


గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన యువకుడితో కూతురికి పెళ్లి నిశ్చయించారు. తమ కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని, ఏడాదికి  కోటి రూపాయల జీతమంటూ ఆ యువకుడి తల్లిదండ్రులు వీరిని నమ్మించారు. దీంతో అప్పులు చేసి, ఆస్తులు అమ్మి రూ.50 లక్షల కట్నం, 55 సవర్ల బంగారం ముట్టజెప్పారు. ఈ ఏడాది మార్చి 18న రూ.15 లక్షలు ఖర్చు పెట్టి కూతురికి ఘనంగా పెళ్లి జరిపించారు. తర్వాత.. తనకు అమ్మాయిలంటే ఇష్టం లేదని, అమెరికాలో బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని, నిన్ను అతడి కోసమే పెళ్లి చేసుకున్నానని, అమెరికా వెళ్లాక నువ్‌ అతడితోనే కాపురం చేయాలంటూ భార్యకు షాకిచ్చాడు. తేరుకునే లోపే... నేను కూడా బాయ్‌ఫ్రెండ్‌తోనే కాపురం చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా మే 21న సదరు ఎన్‌ఆర్‌ఐ భర్త.. భార్యకు చెప్పకుండా.. అమెరికా వెళ్లిపోయాడు. మోసపోయానని గ్రహించిన ఆమె.. తనకు న్యాయం చేయాలని  తల్లిదండ్రులతో కలసి పోలీసులను ఆశ్రయించారు. 

Updated Date - 2020-07-28T13:55:21+05:30 IST