పెళ్లి తంతు పూర్తికాగానే.. ఐసోలేషన్‌కు ఎన్నారై వరుడు..

ABN , First Publish Date - 2020-03-21T16:44:17+05:30 IST

పెళ్లి తంతు పూర్తికాగానే నవ వరుడిని యాదాద్రి జిల్లా అధికారులు శుక్రవారం ఐసోలేషన్‌కు తరలించారు.

పెళ్లి తంతు పూర్తికాగానే.. ఐసోలేషన్‌కు ఎన్నారై వరుడు..

నల్లగొండ: పెళ్లి తంతు పూర్తికాగానే నవ వరుడిని యాదాద్రి జిల్లా అధికారులు శుక్రవారం ఐసోలేషన్‌కు తరలించారు. అమెరికాలో ఉంటున్న వలిగొండ యువకుడు... పోచంపల్లికి చెందిన యువతితో వివాహానికి అధికారులతో పోరాడి అనుమతి పొందాడు. పెళ్లి కోసం ఇటీవలే అమెరికా నుంచి స్వదేశానికి వచ్చాడు. అతడి వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడిని అధికారులు వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-03-21T16:44:17+05:30 IST