ఎల్లలు దాటిన ప్రేమ.. పెళ్లితో ఒక్కటైన వేళ..

ABN , First Publish Date - 2020-03-13T13:52:11+05:30 IST

అమెరికాలో మొదలైన వారి ప్రేమ ఖండాంతరాలను దాటి భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం మూడుముళ్ల బందంతో ఒకటి చేసింది. అమెరికాలో పుట్టిపెరిగిన శాన్‌ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ముగ్దుడై ఇక్కడే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆ ఖండాంతరాల ప్రేమ వివాహానికి నిజామాబాద్‌ వేదికైంది.

ఎల్లలు దాటిన ప్రేమ.. పెళ్లితో ఒక్కటైన వేళ..

ఖండాంతరాలు దాటిన ప్రేమ

హిందూ సంప్రదాయం ప్రకారం  వివాహం చేసుకున్న జంట

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 12: అమెరికాలో మొదలైన వారి ప్రేమ ఖండాంతరాలను దాటి భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం మూడుముళ్ల బందంతో ఒకటి చేసింది. అమెరికాలో పుట్టిపెరిగిన శాన్‌ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ముగ్దుడై ఇక్కడే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆ ఖండాంతరాల ప్రేమ వివాహానికి నిజామాబాద్‌ వేదికైంది. నిజామాబాద్‌కు చెందిన సోమేశ్వర్‌, వరలక్ష్మీల కూతురు అర్చన ఉన్నత చదువుల కో సం 2010లో అమెరికా వెళ్లింది. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్న క్రమంలోనే ఆన్‌లైన్‌లో శాన్‌ తండ్రి జెఫ్‌ పరిచయమయ్యారు. కొంతకాలం పరిచయాలు అర్చనను వారింటి వరకు తీసుకెళ్లాయి. ఇదే  క్రమంలో జెఫ్‌ కుమారుడు శాన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.


హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం ఉన్న జెఫ్‌-సిసిలియా దంపతులు అర్చనతో మాట్లాడి వారి తల్లిదండ్రులను అమెరికా రావాలని కోరారు. అమెరికాకు వచ్చిన అర్చన తల్లిదండ్రులతో జెఫ్‌ దంపతులు మాట్లాడి ప్రేమ వివాహానికి ఒప్పించారు. ఈ క్రమంలో గత యేడాది మే 15న అమెరికాలో అర్చన, శాన్‌ రిజిస్ట్రేషన్‌ మ్యారేజీ చేసుకోగా తమ కుమారుడి వివాహం భారతదేశంలో సంప్రదాయం ప్రకారం చేయాలని కోరడంతో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రావ్య గార్డెన్స్‌లో సోమేశ్వర్‌ బంధుమిత్రుల సమక్షంలో కుమార్తె వివాహం జరిపించారు.


తాను నిజంగా తన కుమార్తెకు ఇంత మంచి భర్తను తెచ్చేవాడిని కాదని, శాన్‌ కుటుంబానికి భారతదే శమన్నా, హిందూ సంప్రదాయాలన్నా ఎనలేని గౌరవం ఉందన్నారు.  జెఫ్‌-సిసిలియా దంపతులు మాట్లాడుతూ త మకు భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలపై చాలా నమ్మ కం ఉందని, ఆ నమ్మకంతోనే ఇక్కడ వివాహం చేయాలని కోరడం జరిగిందన్నారు. అర్చన, శాన్‌ల వివాహ వేడుకల్లో జెఫ్‌-సిసిలియా దంపతులు హిందూ సంప్రదాయ దుస్తు ల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో జెఫ్‌-సిసిలియా దంపతులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. 

Updated Date - 2020-03-13T13:52:11+05:30 IST