నైజీరియా విదేశాంగశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-20T08:59:25+05:30 IST

నైజీరియా విదేశాంగశాఖ మంత్రి జాఫరీ ఆన్‌యెమా కరోనా బారిన పడ్డారు.

నైజీరియా విదేశాంగశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

అబూజ: నైజీరియా విదేశాంగశాఖ మంత్రి జాఫరీ ఆన్‌యెమా కరోనా బారిన పడ్డారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ అని వచ్చింది. ఇక శనివారం గొంతునొప్పిగా ఉందని జాఫరీ మరోమారు కరోనా పరీక్ష చేయించగా.. పాజిటివ్ అని తేలింది. జీవితం అంటే ఇంతేనని.. కొంచెం పొందితే.. మరికొంచెం వదులుకోవాలని ఆయన అన్నారు. తాను ఐసోలేషన్‌కు వెళ్లనున్నట్టు.. అంతా మంచే జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. జాఫరీ విదేశాంగశాఖ మంత్రిగానే కాకుండా కరోనా వైరస్ ప్రెసిడెన్షియల్ టాస్క్ ఫోర్స్ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నారు. కాగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం నైజీరియాలో ఇప్పటివరకు 36,107 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా కారణంగా ఇప్పటివరకు 778 మంది మరణించారు. 


Updated Date - 2020-07-20T08:59:25+05:30 IST