పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన న్యూజిలాండ్ ప్రధాని!

ABN , First Publish Date - 2020-11-13T06:42:50+05:30 IST

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్.. తన వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూ ప్లైమౌత్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి.. ‘ క్లార్క్ గేఫోర్డ్‌తో మీ పెళ్లి

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన న్యూజిలాండ్ ప్రధాని!

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్.. తన వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూ ప్లైమౌత్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి.. ‘ క్లార్క్ గేఫోర్డ్‌తో మీ పెళ్లి ఎప్పుడు’ అంటూ జెసిండా అర్డెర్న్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై స్పందించిన ఆమె.. తమ వివాహానికి కొన్ని ప్లాన్స్ ఉన్నాయని.. వాటిని నెరవేర్చుకున్నాక పెళ్లి చేసుకుంటామని బదులిచ్చారు. ‘మాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వాటిపై కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాలి. అవి నెరవేరడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా.. న్యూజిలాండ్ ప్రధాని వివాహం చేసుకోబోయే క్లార్క్ గేఫోర్డ్.. ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు. వీరికి గతంలోనే ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరిద్దరూ ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే.. గత నెలలో జరిగిన సాధరణ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా రెండోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-11-13T06:42:50+05:30 IST