ఆమె మాటల్లో ఏమాత్రం నిజం లేదు: న్యూయార్క్ గవర్నర్

ABN , First Publish Date - 2020-12-15T21:47:09+05:30 IST

తనపై వచ్చిన లైగింక ఆరోపణలను న్యూయార్క్ గవర్నర్ ఖండించారు. లిండ్సే బొయ్లాన్ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. గతంలో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూ

ఆమె మాటల్లో ఏమాత్రం నిజం లేదు: న్యూయార్క్ గవర్నర్

వాషింగ్టన్: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను న్యూయార్క్ గవర్నర్ ఖండించారు. లిండ్సే బొయ్లాన్ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. గతంలో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో వద్ద ఎకనామిక్ అడ్వైజర్‌గా పని చేసిన లిండ్సే బొయ్లాన్.. క్యూమో‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఆదివారం రోజు ట్వీట్ల వర్షం కురిపించారు. న్యూయార్క్ గవర్నర్ తనను కొన్నేళ్లపాటు లైంగికంగా వేధించినట్టు సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆండ్రూ క్యూమో అడ్మినిస్ట్రేషన్‌లో పని చేసిన సమయంలో కొన్ని సంవత్సరాలపాటు ఆయన నన్ను లైంగికంగా వేధించాడు. ఆయన నన్ను ఇబ్బందిపెట్టడాన్ని చాలా మంది చూశారు. ప్రపంచలో చాలా మంది మహిళలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసు. క్యూమో వంటి కొంత మంది పురుషులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నేను ద్వేషిస్తున్నాను’ అంటూ లిండ్సే బొయ్లాన్ ట్వీట్లు చేశారు. 


ఈ క్రమంలో క్యూమో తరఫున ఆయన ప్రెస్ సెక్రటరీ ఇప్పటికే దీనిపై స్పందించి ఖండించారు. అయితే తాజాగా సోమవారం రోజు ఆండ్రూ క్యూమోనే స్పందించి.. ఆయనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఆమె మాటల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. లిండ్సే బొయ్లాన్ ధైర్యంగా ముందకొచ్చి తన అభిప్రాయలను, ఇబ్బందులను తెలియజేయాలంటూ వ్యాఖ్యానించారు.  కాగా.. 36ఏళ్ల లిండ్సే బొయ్లాన్.. మార్చి 2015 నుంచి అక్టోబర్ 2018 వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో పని చేశారు. 


Read more