మౌంట్ ఎవరెస్ట్‌ ఎత్తును మళ్లీ కొలిచిన నేపాల్.. ఎత్తు ఎంతంటే?

ABN , First Publish Date - 2020-12-07T07:02:20+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా మౌంట్ ఎవరెస్ట్‌కు పేరు. అయితే ఈ పర్వతం ఎత్తుపై సందేహాన్ని వ్యక్తం చేసిన నేపాల్ ప్రభుత్వం

మౌంట్ ఎవరెస్ట్‌ ఎత్తును మళ్లీ కొలిచిన నేపాల్.. ఎత్తు ఎంతంటే?

ఖాత్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా మౌంట్ ఎవరెస్ట్‌కు పేరు. అయితే ఈ పర్వతం ఎత్తుపై సందేహాన్ని వ్యక్తం చేసిన నేపాల్ ప్రభుత్వం పర్వతం ఎత్తును మళ్లీ కొలవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గత ఏడాది నుంచి పర్వతాన్ని కొలుస్తూ డేటాను సేకరించింది. తాము సేకరించిన తాజా డేటా ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంత ఉందనేది మంగళవారం వెల్లడిస్తామని సర్వే డిపార్ట్‌మెంట్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా ఈ డేటా కోసం పనిచేసిన వారిని ఇదే కార్యక్రమంలో సత్కరించనున్నట్టు సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుశిల్ నార్సింగ్ రాజ్‌భండారి చెప్పారు. 


ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి అన్ని మీడియా సంస్థలకు సర్వే డిపార్ట్‌మెంట్ ఆహ్వానాన్ని కూడా పంపింది. కాగా.. 1954లో సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన డేటా ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. అయితే 2015లో నేపాల్‌లో భూకంపం వచ్చిన తరువాత నేపాల్ ప్రభుత్వం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తుపై సందేహాన్ని వ్యక్తం చేసింది. మళ్లీ మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును కొలవాలని నిర్ణయించుకుంది. దీని కోసం చైనా సహాయసహకారాలను కూడా తీసుకుని ఏడాదిగా పర్వతం ఎంత ఎత్తుందో కొలుస్తూ వచ్చింది.

Updated Date - 2020-12-07T07:02:20+05:30 IST