అమెరికాలో భారతీయ విద్యార్థుల బాధలు వర్ణాతీతం:ఎన్ఏఏఐఎస్
ABN , First Publish Date - 2020-06-18T07:34:58+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని నార్త్ అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ (ఎ

వాషింగ్టన్: కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని నార్త్ అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ (ఎన్ఏఏఐఎస్) తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా లాక్‌డౌన్ విధించింది. దీంతో అక్కడ విద్యాసంస్థలు, వసతి గృహాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్ట్‌టైం ఉద్యోగాలు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా..లాక్‌డౌన్ కారణంగా దాదాపు 75వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చిక్కుకున్నారని ఎన్‌ఏఏఐఎస్ వెల్లడించింది. భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినప్పటికీ.. విమాన టికెట్ కొనేందుకు కూడా వారి దగ్గర డబ్బులు లేవని ఎన్ఏఏఐఎస్ వివరించింది. లాక్‌డౌన్ కారణంగా సతమతవతున్న కొంత మంది విద్యార్థులకు ఎన్ఏఏఐఎస్ అండగా నిలిచిందని.. అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధన్షు కౌశిక్ పేర్కొన్నారు.