వందే భారత్ మిషన్: ఇప్పటివరకు ఎంత మంది ప్రవాసులు భారత్ చేరారంటే..

ABN , First Publish Date - 2020-05-12T01:24:34+05:30 IST

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం

వందే భారత్ మిషన్: ఇప్పటివరకు ఎంత మంది ప్రవాసులు భారత్ చేరారంటే..

న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మే 7 నుంచి మే 13 వరకు ఈ కార్యక్రమం సాగనుంది. మే 7 నుంచి మే 10 వరకు దాదాపు 6 వేల మంది ప్రవాసులు భారత్‌కు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో మొత్తంగా 25 విమానాలు విదేశాల నుంచి భారత్‌కు చేరుకోగా.. వీటిలో 5,163 మంది ప్రవాసులు స్వదేశానికి వచ్చారు. విమానాలతో పాటు యుద్ద నౌకల్లో కూడా ప్రవాసులు భారత్‌కు చేరుకుంటున్నారు. మాల్దీవుల నుంచి ఐఎన్ఎస్ జలాశ్వా నౌకలో దాదాపు 700 మంది ప్రవాసులు ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. మరికొన్ని నౌకలు సోమవారం భారత్‌కు చేరుకోనున్నాయి. భారత ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ప్రకారం.. కేరళకు చెందిన వారు 2000 మంది, తమిళనాడు వాసులు 883,766 మంది మహారాష్ట్ర వాసులు, 354 మంది ఢిల్లీ వాసులు, కర్ణాటకకు చెందిన 337 మంది భారత్‌కు చేరుకున్నారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో విదేశాల నుంచి భారత్‌కు చేరుకున్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా దాదాపు 15 వేల మంది ప్రవాసులను భారత్‌కు తీసుకురానున్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత లెక్కల ప్రకారం మరో తొమ్మిది వేల మంది భారతీయులు ఈ వారంలో స్వదేశానికి చేరుకోనున్నారు. కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పకుండా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. విదేశాల నుంచి వచ్చే వారు తమ ప్రయాణ ఖర్చులను కూడా వారే భరించాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-05-12T01:24:34+05:30 IST