ఇప్పటి వరకు ఒమన్ నుంచి ఇండియాకు చేరిన వారి సంఖ్య..!
ABN , First Publish Date - 2020-06-22T19:29:10+05:30 IST
కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని ఒమన్‌లోని భారత రాయబారి మును మహావర్ చెప్పారు.

మస్కట్: కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని ఒమన్‌లోని భారత రాయబారి మును మహావర్ చెప్పారు. కొవిడ్-19 కారణంగా ఒమన్‌లో చిక్కుకున్న దాదాపు 14,855 మందిని ఇండియాకు తరలించినట్లు పేర్కొన్నారు. జూన్ 20 నాటికి ‘వందే భారత్ మిషన్’లో భాగంగా దాదాపు 42 ప్రత్యేక విమానాలను నడిపినట్లు ఆయన పేర్కొన్నారు. తరలింపు ప్రక్రియ కోసం మరో 40 చార్టెడ్ విమానాలు కూడా పని చేసినట్లు వెల్లడించారు. కరోనాకు ముందు వారానికి 250 విమానాలు రెండు దేశాల మధ్య రాకపోకలు సాగించినట్లు వివరించారు. కాగా.. రాబోయే రోజుల్లో ఈ తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఒమన్ నుంచి భారత్ తిరిగి రావడానికి ఎంత మంది రిజిస్టర్ చేసుకున్నారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు.