అమెరికాలో ఓటేసిన 5.9 కోట్లమంది.. 2016 కంటే అరాచక పరిస్థితులు..!

ABN , First Publish Date - 2020-10-27T14:31:26+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 9 రోజుల గడువుంది. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్‌! అయితే ఇప్పటికే 5.9 కోట్ల మంది ఓటేసేశారు. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో దాదాపు నాలుగోవంతు ఓటర్లు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకోవడం అమెరికా చరిత్రలోనే ఓ రికార్డు. ఇంకా చెప్పాలంటే 2016లో పడిన మొత్తం ఓట్లలో

అమెరికాలో ఓటేసిన 5.9 కోట్లమంది.. 2016 కంటే అరాచక పరిస్థితులు..!

ముందస్తు ఓటింగ్‌లో ఇదో రికార్డు

పోస్టల్‌, ఈమెయిల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు

ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం


వాషింగ్టన్‌ (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 9 రోజుల గడువుంది. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్‌! అయితే ఇప్పటికే 5.9 కోట్ల మంది ఓటేసేశారు. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో దాదాపు నాలుగోవంతు ఓటర్లు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకోవడం అమెరికా చరిత్రలోనే ఓ రికార్డు. ఇంకా చెప్పాలంటే 2016లో పడిన మొత్తం ఓట్లలో 42 శాతం ఈసారి ఎన్నికల్లో ముందస్తుగానే బ్యాలెట్లకు చేరాయి. 16 కీలక రాష్ట్రాల నుంచే ఈ మొత్తం ఓట్లు పడ్డాయి.  కరోనావైరస్‌ ఉధృతంగా కాటేస్తుండడంతో బయటకు- అంటే పోలింగ్‌ కేంద్రాలకు రావడానికి సాహసించని ఓటర్లు ఈసారి పోస్టల్‌, ఈమెయిల్‌ బ్యాలెటింగ్‌కు మొగ్గుచూపారు. నవంబరు 3నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చంటున్నారు. 


ఈ ముందస్తు ఓటింగ్‌ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావొచ్చని,  ఎందుకంటే మొత్తం పోలింగ్‌ పూర్తయ్యాకే పోస్టల్‌, మెయిల్‌ ఓట్ల లెక్కింపు కూడా మొదలవుతుందని, ఈ లెక్కింపునకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని, పోలింగ్‌ జరగిన రోజు రాత్రే వెలువడడం అసాధ్యమని, కొన్ని రోజులపాటు సాగొచ్చని ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ తెలిపింది. ఇది 2016 కంటే ఎక్కువగా అరాచక పరిస్థితులకు దారితీసినా ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొంది.

Updated Date - 2020-10-27T14:31:26+05:30 IST