చైనా వైఖరిని వ్యతిరేకిస్తూ.. విదేశాల్లో ప్రవాస భారతీయుల నిరసన!

ABN , First Publish Date - 2020-06-25T08:10:59+05:30 IST

చైనాకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు విదేశాల్లో నిరసనలు తెలిపారు. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి, చైనా సైనికులు భారత సైనికు

చైనా వైఖరిని వ్యతిరేకిస్తూ.. విదేశాల్లో ప్రవాస భారతీయుల నిరసన!

ఒట్టావా: చైనాకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు విదేశాల్లో నిరసనలు తెలిపారు. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి, చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో చైనా దాడిని ఖండిస్తూ.. ఆ దేశా వస్తువులను బహిష్కరించాలని ప్రజలు భావిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా దీనికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా.. కొందరు ప్రవాస భారతీయులు.. కెనడాలోని చైనా రాయబార కార్యాలయం వద్ద నిసనలు చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


Updated Date - 2020-06-25T08:10:59+05:30 IST