కరోనా కాలంలో పేదలకు అండగా నాట్స్..!

ABN , First Publish Date - 2020-06-26T04:17:03+05:30 IST

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో అక్కడ పేదలు, నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందు

కరోనా కాలంలో పేదలకు అండగా నాట్స్..!

బాల్టిమోర్: అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో అక్కడ పేదలు, నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బాల్టిమోర్‌లోని పేదలకు ఆహారాన్ని అందించేందుకు నాట్స్.. ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఆహారాన్ని మేరీల్యాండ్ ఫుడ్ బ్యాంక్‌కు అందచేసింది. మేరీల్యాండ్ ఫుడ్ బ్యాంక్ నిరుపేదలకు ఆహారాన్ని అందిస్తూ వారి ఆకలి తీరుస్తుంది. ఈ నేపథ్యంలో సేకరించిన ఆహారాన్ని నాట్స్.. మేరీల్యాండ్ ఫుడ్ బ్యాంక్‌కు అందజేసింది. నాట్స్ నాయకులు విజయ్ శేఖర్ అన్నే, అశోక్ గుత్తా సహాకార సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. కిరణ్ యార్లగడ్డ, అనుపమ గార్లపాటి, అంజలి యార్లగడ్డ, సిదార్థ సూరపనేనితో పాటు యువ వాలంటీర్లు సాహితీ, సహస్ర ఈ కార్యక్రమానికి తమ వంతు సాయం అందించారు. కరోనాపై పోరాడే క్రమంలో ఇలాంటి సేవ కార్యక్రమాలను మరిన్ని చేపడతామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ డాలస్ విభాగం నుండి అశోక్ గుత్తా, బాల్టిమోర్ నాట్స్ హెల్ప్ లైన్  కోఆర్డినేటర్ కిరణ్ యార్లగడ్డ లు ఈ విషయంలో చూపుతున్న చొరవను వారు ప్రశంసించారు.


Updated Date - 2020-06-26T04:17:03+05:30 IST