హత్య కేసులో ప్రధాన నిందితుడు.. 25ఏళ్ల క్రితం పారిపోయి..!

ABN , First Publish Date - 2020-06-27T05:18:30+05:30 IST

ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు.. 25ఏళ్ల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి, పోలీసులకు పట్టబడ్డ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 1995లో కేరళకు చెందిన ఒతాయ్ మనఫ్ పల్లిపరంబన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య

హత్య కేసులో ప్రధాన నిందితుడు.. 25ఏళ్ల క్రితం పారిపోయి..!

కేరళ: ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు.. 25ఏళ్ల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి, పోలీసులకు పట్టబడ్డ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 1995లో కేరళకు చెందిన ఒతాయ్ మనఫ్ పల్లిపరంబన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో షఫీక్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో షఫీక్.. షార్జాకు పారిపోయాడు. అయితే తాజాగా కొవిడ్-19 నేపథ్యంలో ప్రైవేట్ విమానంలో షఫీక్.. బుధవారం రోజు కేరళకు చేరుకున్నాడు. హత్య కేసు విచారణ సందర్భంగా పోలీసులు విడుదల చేసిన లుక్‌అవుట్ నోటీసు ఆధారంగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు షఫీక్‌ను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేరళ పోలీసులు షఫీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2020-06-27T05:18:30+05:30 IST