కొడుకు ద్వారా తల్లికి కరోనా..
ABN , First Publish Date - 2020-03-16T10:46:02+05:30 IST
విదేశాల నుంచి కరోనాను వెంటబెట్టుకు వచ్చిన కొడుకు కోలుకుంటుండగా.. అతని ద్వారా ఆ మహమ్మారి సోకిన తల్లి చనిపోయింది. వైరస్ లక్షణాలు
- కోలుకుంటున్న కొడుకు.. బలైపోయిన తల్లి
న్యూఢిల్లీ, మార్చి 15: విదేశాల నుంచి కరోనాను వెంటబెట్టుకు వచ్చిన కొడుకు కోలుకుంటుండగా.. అతని ద్వారా ఆ మహమ్మారి సోకిన తల్లి చనిపోయింది. వైరస్ లక్షణాలు ఉన్నవాళ్లను ఎందుకు ఏకాంతవాసంలో ఉండమంటున్నారనడానికి ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఓ నిదర్శనం. ఒక వ్యక్తి గత నెలలో స్విట్జర్లాండ్, ఇటలీ వెళ్లి తిరిగి వచ్చాడు. మొదట్లో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. ఒకరోజు తర్వాత జ్వరం, దగ్గు రావడంతో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లాడు. తల్లికి కూడా జ్వరం, దగ్గు ఉండడంతో ఇద్దరికీ చికిత్స ప్రారంభించారు. వైద్య పరీక్షల్లో ఇద్దరికీ కరోనా ఉందని తేలింది. కాగా, షుగర్, బీపీ ఉండడంతో పరిస్థితి విషమించి తల్లి మృతిచెందింది. కుమారుడి ఆరోగ్యం మెరుగవడంతో ఐసొలేషన్ వార్డుకు మార్చారు.