మెక్సికో ఆర్థిక మంత్రికి కరోనా పాజిటివ్..!

ABN , First Publish Date - 2020-06-27T02:43:37+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కాగా.. మెక్సి

మెక్సికో ఆర్థిక మంత్రికి కరోనా పాజిటివ్..!

మెక్సికో: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కాగా.. మెక్సికోలోనూ మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 6వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 736 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మెక్సికో ఇప్పటి వరకు 2లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. మరణించిన వారి సంఖ్య 25వేల మార్క్‌ను దాటింది. ఇదిలా ఉంటే.. మెక్సికో ఆర్థిక మంత్రి అర్టురో హెర్రెరకు కరోనా వైరస్ సోకినట్లు గురువారం రోజు నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపిన ఆయన.. హోం క్వారెంటైన్‌లో ఉండి, పని చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  


Updated Date - 2020-06-27T02:43:37+05:30 IST