ట్రంప్‌కు దూరంగా.. సైనికుడి చేయి పట్టుకుని నడిచిన మెలానియా !

ABN , First Publish Date - 2020-11-13T17:26:10+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

ట్రంప్‌కు దూరంగా.. సైనికుడి చేయి పట్టుకుని నడిచిన మెలానియా !

మెలానియా షాకింగ్ ప్రవర్తన.. ట్రంప్‌కు దూరంగా.. సోల్జర్‌కు దగ్గరగా..

ఆర్లింగ్టన్(యూఎస్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇంకా చెప్పాలంటే బయట కూడా అంతగా కనిపించలేదు. సోషల్ మీడియా వేదికగానే ఆయన ఎన్నికల ఫలితాలు, ఇతర విషయాలపై స్పందిస్తున్నారు. కేవలం రెండు సార్లు మాత్రం ఆయనకు ఎంతో ఇష్టమైన గోల్ఫ్ ఆడుకుంటూ బయట కనిపించారు. కాగా, బుధవారం వెటరన్స్ డే సందర్భంగా ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికను సందర్శించారు. అమెరికా ఆర్మీలో సేవలందించిన వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది నవంబర్ 11వ తేదీన వెటరన్స్ డేను జరుపుతారు. అయితే, ఈ కార్యక్రమంలో అమెరికన్ ప్రథమ మహిళ మెలానియా ప్రవర్తించిన తీరు అక్కడి వారిని షాక్‌కు గురిచేసింది. ఆమె సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కారు. ఇదే కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇవాంక మాత్రం ఫేస్‌మాస్కులతో సామాజిక దూరం పాటిస్తూ కనిపించారు. 


ట్రంప్ ఫేస్‌మాస్కు ధరించనప్పటికీ సామాజిక దూరం పాటించారు. సైనికులకు దూరంగా నడిచారు. కానీ, మెలానియా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఓ సైనికుడి చేయి పట్టుకుని అతనికి దగ్గరగా నడిచారు. కార్యక్రమం ముగిసే వరకు ఆమె సోల్జర్‌కు దగ్గరగా.. ట్రంప్‌కు దూరంగానే నడిచారు. దీంతో తన వింత ప్రవర్తనతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని మెలానియా ఒకింత షాక్‌కు గురి చేశారనే చెప్పాలి. మరోవైపు ట్రంప్‌కు మెలానియా త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త ఇటీవల నెట్టింట బాగా హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలైన ఒమరోసా మానిగోల్ట్ న్యూమాన్ ఈ రూమర్లకు తెరలేపారు. జనవరిలో ట్రంప్ అధ్యక్ష పీఠం దిగగానే  వీరి వివాహబంధానికి శుభం కార్డు పడనుందని న్యూమాన్ చెబుతున్నారు. ట్రంప్ ఓటమి తర్వాత విడాకుల కోసం మెలానియా ప్రతి నిమిషం లెక్కిస్తోందని చెప్పారు. ఇక ఇదే అదనుగా ట్రంప్, మెలానియాల విడాకులపై ఇప్పటికే చాలా రూమర్లు పుట్టుకువస్తున్నాయి. ఒకవేళ ట్రంప్‌ను మెలానియా వదిలేస్తే ఆమెకు భరణం రూపంలో భారీ మొత్తం అందనుందట. మొదటి ఇద్దరు భార్యలకు ఇచ్చిన దాని కంటే కూడా మెలానియాకు ట్రంప్ భారీ మొత్తం ఇవ్వాల్సి ఉంటుందట. దీని విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

Updated Date - 2020-11-13T17:26:10+05:30 IST