టర్కీలో బయటపడ్డ ప్రపంచంలోనే అతిభారీ బంగారు నిక్షేపం!

ABN , First Publish Date - 2020-12-26T12:58:58+05:30 IST

మెకన్నాస్‌ గోల్డ్‌ సినిమా గుర్తుందా! హీరో నిధి వేటకు బయలుదేరడం. ఎదురైన అడ్డంకుల్ని అధిగమించి.. చివరకు బంగారు కొండను చేరుకోవడం.. అప్పుడెప్పుడో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ఇది.

టర్కీలో బయటపడ్డ ప్రపంచంలోనే అతిభారీ బంగారు నిక్షేపం!

ప్రపంచంలోనే అతిపెద్ద నిక్షేపం వెలుగులోకి

న్యూఢిల్లీ, డిసెంబరు 25: మెకన్నాస్‌ గోల్డ్‌ సినిమా గుర్తుందా! హీరో నిధి వేటకు బయలుదేరడం. ఎదురైన అడ్డంకుల్ని అధిగమించి.. చివరకు బంగారు కొండను చేరుకోవడం.. అప్పుడెప్పుడో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ఇది. ఇప్పుడు అచ్చం అలాంటి మెకన్నాస్‌ గోల్డే టర్కీలో బయటపడింది. ప్రస్తుతం బయటపడ్డ నిక్షేపం మాత్రం ప్రపంచంలోనే అతిభారీ బంగారు నిక్షేపం. అందులో దాదాపు 99 టన్నుల బంగారం ఉంటుందని అంచనా. దీని విలువ సుమారు 6 బిలియన్‌ డాలర్లు.. అంటే దాదాపు రూ. 44 వేల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇది.. చాలా దేశాల జీడీపీ కన్నా ఎక్కు వ కావడం గమనార్హం.  ఎరువుల తయారీ సంస్థ గ్యూబెర్టాస్‌.. దేశ వ్యవసాయ సహకార సంస్థతో కలిసి ఈ నిక్షేపాన్ని వెలుగులోకి తెచ్చింది. 

Updated Date - 2020-12-26T12:58:58+05:30 IST