డాక్టర్ల సేవలకు సలాం కొట్టిన మేరీల్యాండ్ ప్రజలు..!

ABN , First Publish Date - 2020-05-10T16:04:48+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ మహమ్మారి.. కరాళ నృత్యం చేస్తోంది. వైద్యులు తమ ప్రాణాలను పణంగా.. కరోనా బాధితులకు

డాక్టర్ల సేవలకు సలాం కొట్టిన మేరీల్యాండ్ ప్రజలు..!

వాషింగ్టన్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ మహమ్మారి.. కరాళ నృత్యం చేస్తోంది. వైద్యులు తమ ప్రాణాలను పణంగా.. కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని మేరీ ల్యాండ్ ప్రజలు.. డాక్టర్లకు తమ సంఘీభావం తెలిపారు. స్థానిక డాక్టర్ల ఇంటి ముందు.. వాహనాలతో భారీ పెరేడ్ నిర్వహించి వారిని గౌరవించారు. అంతేకాకుండా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు చిన్నారులు వీడియో సందేశం ద్వారా డాక్టర్లు చేస్తున్న సేవలకు సలాం కొట్టారు. దీనిపై స్పందించిన డాక్టర్ అనంత్, మధు, మాధవి, మల్లిక.. సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా కాటుకు 80వేల మంది కన్నుమూశారు. 13.50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 

Updated Date - 2020-05-10T16:04:48+05:30 IST