ప్రతిష్టను దెబ్బతీశాడంటూ కోర్టులో కేసు వేసిన మహిళ.. జడ్జి ఏం తీర్పిచ్చారంటే..
ABN , First Publish Date - 2020-09-18T06:24:32+05:30 IST
మహిళ అనుమతి లేకుండా ఆమె ఇంటిలోకి వెళ్లినందుకు 45,000 దిర్హామ్‌లు(రూ. 9 లక్షలు) నష్టపరిహారం

అబూధాబీ: మహిళ అనుమతి లేకుండా ఆమె ఇంటిలోకి వెళ్లినందుకు 45,000 దిర్హామ్‌లు(రూ. 9 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఓ వ్యక్తిని అబూధాబీ కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు కొద్ది రోజుల క్రితం బాధితురాలి ఇంటిలోకి ఆమె అనుమతి లేకుండా వెళ్లాడు. అంతేకాకుండా ఇంటిలోకి ఎందుకు ప్రవేశించాడన్న కారణం కూడా మహిళకు చెప్పలేదు. దీంతో నిందితుడి వల్ల స్థానికంగా తన ప్రతిష్టకు హాని కలిగిందంటూ మహిళ కోర్టులో కేసు వేసింది. బాధితురాలి వాదనను విన్న జడ్జి నిందితుడికి 50 వేల దిర్హామ్‌ల(రూ. పది లక్షలు) జరిమానా విధించారు. ఇక తన ప్రతిష్టకు హాని కలిగినందుకు గాను లక్ష దిర్హామ్‌ల(రూ. 20 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలని మహిళ సివిల్ కేసు వేయగా.. 45,000 దిర్హామ్‌లు మహిళకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ కోర్టు నిందితుడిని ఆదేశించింది.