160 లాటరీ టికెట్లను కొనుగోలు చేసిన అమెరికన్.. ఊహించని విధంగా..
ABN , First Publish Date - 2020-12-13T05:51:46+05:30 IST
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం. రాత్రికి రాత్రే పేదవాడు ధనవంతుడు అయిపోవచ్చు.

వర్జీనియా: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం. రాత్రికి రాత్రే పేదవాడు ధనవంతుడు అయిపోవచ్చు.. ధనవంతుడు పేదవాడు అయిపోవచ్చు. ఇప్పుడు ఈ అదృష్టం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన క్వేమ్ క్రాస్ అనే వ్యక్తి లాటరీ గెలవాలని చెప్పి ఈ నెల ఐదో తేదీన ఒకేసారి 160 టికెట్లను కొనుగోలు చేశాడు. అది కూడా 7314 అనే నెంబర్‌తో ముగిసే లాటరీ టికెట్లను కొన్నాడు. తీరా ఏడో తేదీన వచ్చిన రిజల్ట్ చూస్తే.. క్వేమ్ క్రాస్ కొన్న 160 లాటరీ టికెట్లలో బంపర్ ప్రైజ్ తగిలింది. ఒక లాటరీ టికెట్‌లో అత్యధికంగా 5 వేల డాలర్ల ప్రైజ్‌ను క్వేమ్ క్రాస్ గెలుపొందాడు. 160 టికెట్లపై క్వేమ్ క్రాస్ మొత్తం 8 లక్షల డాలర్ల(దాదాపు రూ. 5.9 కోట్లు)ను గెలుచుకున్నాడు. ఒక్క దెబ్బకు కోటీశ్వరుడైపోవడంతో క్వేమ్ క్రాస్ ఎగిరి గెంతులేస్తున్నాడు. తాను అన్ని ప్రైజ్‌లు గెలిచానంటే నమ్మలేకపోయానని.. 82 సార్లు చెక్ చేసుకున్నానంటూ క్వేమ్ క్రాస్ చెప్పుకొచ్చాడు.