అలసిపోయి ఇంటికొచ్చిన డాక్టర్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన భర్త

ABN , First Publish Date - 2020-03-30T22:54:19+05:30 IST

కొవిడ్-19 కారణంగా వైద్యులు, పోలీసు అధికారులు, పారిశుధ్య కార్మికులు విధులకే పరిమితమైపోతున్నారు.

అలసిపోయి ఇంటికొచ్చిన డాక్టర్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన భర్త

కొవిడ్-19 కారణంగా వైద్యులు, పోలీసు అధికారులు, పారిశుధ్య కార్మికులు విధులకే పరిమితమైపోతున్నారు. కరోనాను నియంత్రించేందుకు వీరందరూ రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇదిలా ఉండగా.. రోజంతా ఆసుపత్రిలో కష్టపడి ఇంటికొస్తున్న భార్య(డాక్టర్ )కు భర్త సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. దీనికోసం ఇంటిలోని హాల్‌నే కోటగా మార్చేశాడు. 


ఇంతకూ మనోడు ఏం చేశాడంటే.. ఇంటి మొత్తాన్ని పరిశుభ్రం చేసేసి.. ఇంట్లో ఉన్న దుప్పట్లతో హాల్‌లో చిన్న కోట(గది)ను నిర్మించాడు. 


అనంతరం ఆ కోట లోపల తన భార్య రిలాక్స్‌ అయ్యేందుకు మ్యూజిక్ సిస్టమ్‌, టీవీని ఏర్పాటు చేశాడు. 


కాగా.. ఇంటికొచ్చిన భార్య తన భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి ఆనందించింది. ఈ వీడియోను భర్త ప్రముఖ సోషల్ వెబ్‌సైట్‌ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. 


తన భార్యకు ఇష్టమైన ఆహారాన్ని, వైన్‌ను కూడా సిద్దం చేశాడు. భర్త, పప్పీలు వెయిట్ చేస్తున్నట్టు లెటర్ కూడా రాసి పెట్టాడు.


తన భార్య అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కలతో కోట లోపల భార్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.


ఈ వీడియోకు వేలాది మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రజల కోసం భార్య.. భార్య కోసం భర్త చేస్తున్న కృషికి తాము ముగ్దులయ్యామంటూ కొంత మంది కామెంట్ పెట్టారు. తాము కూడా భార్య కోసం ఇలానే చేస్తే.. భార్యకు మరింత తలనొప్పి వచ్చిందంటూ మరికొంతమంది భార్తలు ఆవేదన చెప్పుకున్నారు. 

Updated Date - 2020-03-30T22:54:19+05:30 IST