కుటుంబాన్ని కసిదీరా కాటేసిన క‌రోనా.. 15 రోజుల వ్య‌వ‌ధిలోనే..

ABN , First Publish Date - 2020-04-15T13:52:12+05:30 IST

ఆనందంగా సాగిపోతున్న ఓ కుటుంబంపై ఏదో పగబట్టినట్లు.. కరోనా కసిదీరా కాటేసేంది. రోజుల వ్యవధిలో దంపతులను మింగేసింది.

కుటుంబాన్ని కసిదీరా కాటేసిన క‌రోనా.. 15 రోజుల వ్య‌వ‌ధిలోనే..

కుటుంబంపై కరోనా కాటు

15 రోజుల్లో తల్లిదండ్రులు, కుమార్తె మృతి

చివరి ఘడియల్లో వైర్‌సపై చైతన్యం

లండన్‌, ఏప్రిల్‌ 14: ఆనందంగా సాగిపోతున్న ఓ కుటుంబంపై ఏదో పగబట్టినట్లు.. కరోనా కసిదీరా కాటేసేంది. రోజుల వ్యవధిలో దంపతులను మింగేసింది. దాన్నుంచి తేరుకునేలోపే వారి కుమార్తెనూ బలి తీసుకుంది. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. కీత్‌ (84), జీన్‌ మాక్‌వికర్‌ (82) స్టాఫర్డ్‌షైర్‌ ప్రాంతవాసులు. ఇతర ఆరోగ్య సమస్యలు లేకున్నా.. వృద్ధాప్యం కారణంగా వైరస్‌ ధాటిని తట్టుకోలేకపోయారు. వెంటవెంటనే ప్రాణాలు కోల్పోయారు.


ఈలోగానే కుమార్తె జేన్‌ (62)లో లక్షణాలు బయటపడ్డాయి. కరోనాపై ఆమె కాస్త పోరాడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌ ద్వారా వైర్‌సపై చైతన్యం చేయసాగింది. క్రైం అనలి్‌స్టగా పోలీస్‌ విభాగంలో పనిచేసిన జేన్‌.. ‘ఇళ్లలోనే ఉండండి. అదే మన ప్రాణాలకు రక్ష’ అని సూచించేలా ప్రొఫైల్‌ పిక్చర్‌ను మార్చింది. సోదరుడు రిచర్డ్‌ (60) సైతం జేన్‌ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించమంటూ స్నేహితులకు సందేశాలు పంపసాగాడు. చివరకు గత శనివారం జేన్‌ తుదిశ్వాస విడిచింది.  

Updated Date - 2020-04-15T13:52:12+05:30 IST