కువైట్‌కు జ‌పాన్ 'ఎవిగ‌న్' మాత్ర‌లు...

ABN , First Publish Date - 2020-06-06T17:56:53+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా నియంత్ర‌ణ‌లో జ‌పాన్ ఉత్ప‌త్తి చేస్తున్న 'ఎవిగ‌న్' డ్ర‌గ్స్ స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డంతో కువైట్ ఈ మాత్ర‌లు దిగుమ‌తి చేసుకుంటోంది.

కువైట్‌కు జ‌పాన్ 'ఎవిగ‌న్' మాత్ర‌లు...

కువైట్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనా నియంత్ర‌ణ‌లో జ‌పాన్ ఉత్ప‌త్తి చేస్తున్న 'ఎవిగ‌న్' డ్ర‌గ్స్ స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డంతో కువైట్ ఈ మాత్ర‌లు దిగుమ‌తి చేసుకుంటోంది. వ‌చ్చే వారంలోగా ఈ మందులు త‌మ దేశానికి చేరుకుంటాయ‌ని కువైట్ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. వాణిజ్య కోణంలో కాకుండా మాన‌వ‌తదృక్ప‌థంతో జ‌పాన్ త‌మ‌కు ఈ మాత్ర‌లు స‌ర‌ఫ‌రా చేస్తోందని ఈ సంద‌ర్భంగా ఆరోగ్య‌శాఖ పేర్కొంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో నిర్వ‌హించిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో సానుకూల ఫ‌‌లితాలు వ‌చ్చిన నేప‌థ్యంలో జ‌పాన్ నుంచి ఎవిగ‌న్ డ్ర‌గ్స్ దిగుమ‌తి చేసుకుంటున్న‌ట్లు కువైట్ ప్ర‌భుత్వం తెలిపింది. 

Updated Date - 2020-06-06T17:56:53+05:30 IST