విమాన సర్వీసులపై కువైట్ కీలక నిర్ణయం !

ABN , First Publish Date - 2020-12-30T21:15:34+05:30 IST

కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో డిసెంబర్ 21 నుంచి దేశ సరిహద్దును మూసివేడయంతో పాటు విమాన సర్వీసులను నిలిపివేసిన కువైట్ జనవరి 2 నుంచి తిరిగి వీటిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

విమాన సర్వీసులపై కువైట్ కీలక నిర్ణయం !

కువైట్ సిటీ: కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో డిసెంబర్ 21 నుంచి దేశ సరిహద్దును మూసివేడయంతో పాటు విమాన సర్వీసులను నిలిపివేసిన కువైట్ జనవరి 2 నుంచి తిరిగి వీటిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, దేశంలోకి నేరుగా ప్రవేశంలేని 35 దేశాలపై నిషేధాన్ని మాత్రం అలాగే కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. దేశ ప్రధాని షేక్ సభా అల్ ఖలీద్ అల్ సభా నేతృత్వంలో తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీంతో 12 రోజుల పాటు మూతపడిన కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం జనవరి 2 నుంచి తెరుచుకోనుంది. అలాగే రోడ్డు, జల మార్గాలను సైతం ఇదే రోజు ఓపెన్ చేయనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. కమర్షియల్ విమాన సర్వీసులు జనవరి 2న ఉదయం 4 గంటల నుంచి ప్రారంభం అవుతాయని డీజీసీఏ పేర్కొంది.        

Updated Date - 2020-12-30T21:15:34+05:30 IST