కువైట్లో కరోనా విలయతాండవం..!
ABN , First Publish Date - 2020-07-08T19:48:48+05:30 IST
గల్ఫ్ దేశాల్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్లో ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.

కువైట్ సిటీ: గల్ఫ్ దేశాల్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్లో ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. కువైట్లో గడిచిన 24 గంటల్లో 762 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు కువైట్లో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 52,007కు చేరింది. మరో 593 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం కోలుకున్నవారు 42,108 మంది అయ్యారు. అలాగే ఇవాళ సంభవించిన రెండు మరణాలతో కలిపి ఆ దేశంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 379కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,520 యాక్టివ్ కేసులు ఉండగా... వీటిలో 161 మందికి సీరియస్గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు ఇప్పటికే కువైట్ కరోనా టెస్టులు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు కువైట్ వ్యాప్తంగా 4లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉంటే... ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఇప్పటివరకూ ఏకంగా కోటి 19 లక్షల మందికి ప్రబలింది. 5.45 లక్షల మందిని బలిగొంది.