కువైట్‌లో అంతకంతకు పెరుగుతున్న రికవరీలు..
ABN , First Publish Date - 2020-08-12T19:19:26+05:30 IST
గల్ఫ్ దేశమైన కువైట్‌లో అంతకంతకు కరోనా రికవరీలు పెరుగుతున్నాయి.

కువైట్ సిటీ: గల్ఫ్ దేశమైన కువైట్‌లో అంతకంతకు కరోనా రికవరీలు పెరుగుతున్నాయి. మంగళవారం 668 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 731 రికవరీలు నమోదయ్యాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే నలుగురు కోవిడ్‌తో మరణించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డ వారు 73,068 అయితే... మొత్తం రికవరీలు 64,759 అయ్యాయి. మరణాల సంఖ్య 486కు చేరింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 7,823 కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 110 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 539,461 కోవిడ్ టెస్టులు నిర్వహించింది కువైట్. ఇదిలా ఉంటే... వరల్డ్‌వైడ్‌గా విలయతాండవం చేస్తున్న ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికే 7.46 లక్షల మంది బలయ్యారు. అలాగే రెండు కోట్లకు పైగా మందికి ఈ వైరస్ సోకింది.