ప్రవాస ఉద్యోగులను తొలగిస్తున్న కువైట్.. కారణమిదే !

ABN , First Publish Date - 2020-12-19T18:00:35+05:30 IST

కువైట్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో ప్రవాస ఉద్యోగులను తొలిగించేందుకు రెడీ అవుతోంది.

ప్రవాస ఉద్యోగులను తొలగిస్తున్న కువైట్.. కారణమిదే !

కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో ప్రవాస ఉద్యోగులను తొలిగించేందుకు రెడీ అవుతోంది. స్వదేశీకరణలో భాగంగా స్థానికులకు అధిక ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అక్కడి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ ఏకంగా 80 మంది ప్రవాస ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు మినిస్ట్రీ అండర్‌సెక్రెటరీ ఇస్మాయిల్ అల్ ఫెలకావి వెల్లడించారు. ఇక తొలగిస్తున్న 80 మంది ఉద్యోగుల్లో కన్సల్టేంట్స్, అకౌంటెంట్స్, ఇంజినీర్స్, స్పెషల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు ఈ విషయమై నోటీసులు కూడా జారీ చేశామని ఇస్మాయిల్ తెలిపారు. అలాగే ఈ 80 మంది ఉద్యోగుల వివరాలను తదుపరి ప్రొసిజర్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ అధికారులు సివిల్ సర్వీస్ కమిషన్‌కు పంపించడం జరిగింది. 

Read more