కువైట్ ఎయిర్‌వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం...

ABN , First Publish Date - 2020-05-29T16:10:17+05:30 IST

కువైట్ ఎయిర్‌వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

కువైట్ ఎయిర్‌వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం...

కువైట్ సిటీ: కువైట్ ఎయిర్‌వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కువైటైజేష‌న్ ప్ర‌ణాళిక‌లో భాగంగా సంస్థ‌కు చెందిన ఆరు వేల మంది ఉద్యోగుల్లో 1500 మంది ప్రవాసీయుల‌ను తొల‌గించేందుకు రెడీ అవుతోంది. అయితే... కువైటీస్‌, గ‌ల్ఫ్ పౌరులు, కువైట్ మ‌హిళ‌ల‌ను వివాహ‌మాడిన వారిపై వేటు ఉండద‌ని సంస్థ అధికార వ‌ర్గాల స‌మాచారం. కాగా, క‌రోనా సంక్షోభం వ‌ల్ల ఏర్ప‌డిన విప‌త్క‌ర ప‌రిస్థితులు కూడా ఉద్యోగుల తొల‌గింపుకు మ‌రో కార‌ణం అని తెలుస్తోంది. మ‌రోవైపు కువైట్‌లో విజృంభిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా ఇప్ప‌టి వ‌ర‌కు 24,112 మందికి సోకింది. 185 మందిని బ‌లిగొంది. 

Updated Date - 2020-05-29T16:10:17+05:30 IST