విదేశీ ప్ర‌యాణాల‌పై ప్ర‌వాసులు, పౌరుల‌కు కువైట్ కీల‌క సూచ‌నలు‌

ABN , First Publish Date - 2020-07-11T17:48:56+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో కువైట్ త‌మ దేశ పౌరులు, ప్రవాసుల‌కు విదేశీ ప్ర‌యాణాల‌పై కీల‌క సూచ‌న‌లు చేసింది.

విదేశీ ప్ర‌యాణాల‌పై ప్ర‌వాసులు, పౌరుల‌కు కువైట్ కీల‌క సూచ‌నలు‌

కువైట్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో కువైట్ త‌మ దేశ పౌరులు, ప్రవాసుల‌కు విదేశీ ప్ర‌యాణాల‌పై కీల‌క సూచ‌న‌లు చేసింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విదేశీ ప్ర‌యాణాలు మానుకోవ‌డ‌మే మేలు అని కోరింది. వర‌ల్డ్‌వైడ్‌గా కోవిడ్‌-19 విరుచుకుప‌డుతుంది క‌నుక విదేశాల‌కు ప్ర‌యాణించ‌క‌పోవ‌డం మంచిద‌ని సూచించింది. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో త‌ప్పిస్తే అన‌వ‌స‌ర ప్ర‌యాణాలను వాయిదా వేసుకోవాల‌ని తెలిపింది. ఎందుకంటే ప్ర‌యాణ స‌మ‌యంలో సులువుగా ఈ వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశం ఉండ‌డంతో కువైట్ ఈ సూచ‌న‌లు చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కువైట్ ఆరోగ్య‌శాఖ ఒక ట్వీట్ చేసింది. 


ఇదిలా ఉంటే... కువైట్‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. శుక్ర‌వారం 740 కొత్త కేసులు న‌మోదైతే... 528 మంది రిక‌వ‌రీ అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 53,580 మంది కోవిడ్ బారిన ప‌డ‌గా... 43,214 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే కువైట్‌ వ్యాప్తంగా 383 మందిని బ‌లిగొంది.

Updated Date - 2020-07-11T17:48:56+05:30 IST