జైశంకర్, ఇటలీ ఎంబసీకి కేటీఆర్ ట్వీట్
ABN , First Publish Date - 2020-03-13T14:08:18+05:30 IST
మీ ప్రభుత్వాలే పట్టించుకోనప్పుడు తామెందుకు స్పందించాలని ఇటలీ ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారంటూ తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి తన వీడియో సందేశాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

హైదరాబాద్: మీ ప్రభుత్వాలే పట్టించుకోనప్పుడు తామెందుకు స్పందించాలని ఇటలీ ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారంటూ తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి తన వీడియో సందేశాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన కేటీఆర్ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఇటలీలోని భారత ఎంబసీకి రీట్వీట్ చేశారు. మరోవైపు ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను రప్పించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈటల అధ్యక్షతన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.