ప్రపంచ పర్యాటకానికి కరోనా ఘాతం!

ABN , First Publish Date - 2020-03-02T09:00:03+05:30 IST

న్యూయార్క్‌, మార్చి 1: ప్రపంచ పర్యాటక రంగంపై కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ పంజా విసురుతోంది. కరోనా నేపథ్యంలో అన్ని దేశాలు ‘ట్రావెల్‌ బ్యాన్‌’ దిశగా

ప్రపంచ పర్యాటకానికి కరోనా ఘాతం!

  • ప్రయాణానికి పర్యాటకుల వెనుకంజ..
  • బిజినెస్‌ ట్రిప్పులు కూడా భారీగా రద్దు


న్యూయార్క్‌, మార్చి 1: ప్రపంచ పర్యాటక రంగంపై కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ పంజా విసురుతోంది. కరోనా నేపథ్యంలో అన్ని దేశాలు ‘ట్రావెల్‌ బ్యాన్‌’ దిశగా సాగుతున్నాయి. దీంతో సాలీనా రూ.411.40 లక్షల కోట్ల ఆదాయం ఉన్న పర్యాటక రం గంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలతో సమీప భవిష్యత్తులో పర్యాటకం పరిస్థితి దారుణంగా దిగజారే ప్రమాదముందని మూడీ లాంటి మార్కెట్‌ విశ్లేషణ సంస్థలు ఆందోళ న వ్యక్తం చేస్తున్నాయి. 31.9 కోట్ల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నాయి.నిషేధాలతో అతలాకుతలం

చాలా దేశాలు చైనాకు రాకపోకల ను నిషేధించాయి. డ్రాగన్‌ దేశం తర్వాత అత్యధిక కరోనా బాధితులున్న దక్షిణ కొరియాకు 70 దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి. కోవిడ్‌- 19తో అతలాకుతలం అవుతున్న ఇరాన్‌ నుంచి రాకపోకలపై అమెరికా 14 రోజుల నిషేధం విధించింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా 18 కోట్ల పాస్‌పోర్టులున్న పౌరులతో అంతర్జాతీ య పర్యాటక రంగానికి చైనా ప్రధాన ఆదాయ వనరు అని ఆయా సంస్థలు చెబుతున్నాయి. చైనా తర్వాత ఆ స్థాయిలో పాస్‌పోర్టులున్న పౌరులు(14.7 కోట్లు) అమెరికాలో ఉన్నారు. ఒక్క అమెరికాలోనే ముందస్తుగా వేస వి పర్యాటకానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న వారు.. ఇప్పుడు దేశం వదిలి వెళ్లడానికి జంకుతున్నారు. తమ షెడ్యూల్స్‌ని మార్చుకున్నారని ‘కైసర్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.


వ్యాపార పర్యటనలపైనా ప్రభావం

ఈ నెలలో పలు దేశాల్లో 400కు పైగా ప్రపంచస్థాయి కాన్ఫరెన్సులు జరగాల్సి ఉండగా.. కరోనా భయంతో సగానికి పైగా రద్దయ్యాయి. బార్సిలోనాలో ‘ప్రపంచ మొబైల్‌ కాంగ్రె స్‌’, జెనీవాలో ‘మో టార్‌ షో’, ‘ఎఫ్‌-8 కాన్ఫరెన్స్‌’, బెర్లిన్‌లో జరగాల్సిన ‘అంతర్జాతీయ పర్యాటక షో’ రద్దుకావడంతో లక్షల సంఖ్యలో అంతర్జాతీయ ‘బిజినెస్‌ ప్రయాణాలు’ నిలిచిపోయాయి. బిజినెస్‌ ట్రిప్పులను లక్ష మంది రద్దు చేసుకున్నారు.

Updated Date - 2020-03-02T09:00:03+05:30 IST