డబ్ల్యూహెచ్‌వోలో భారత్‌కు కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2020-04-24T08:05:36+05:30 IST

కొవిడ్‌పై పోరులో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారత్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థలో(డబ్ల్యూహెచ్‌వో) కీలక బాధ్యతలను చేపట్టనుంది.

డబ్ల్యూహెచ్‌వోలో భారత్‌కు కీలక బాధ్యతలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: కొవిడ్‌పై పోరులో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారత్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థలో(డబ్ల్యూహెచ్‌వో) కీలక బాధ్యతలను చేపట్టనుంది. మే నెలలో భారత ప్రతినిధి డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బాడీ చైర్‌పర్సన్‌గా నియమితులు కానున్నారు. 34 మంది సభ్యులున్న ఎగ్జిక్యూటివ్‌ బాడీకి ప్రస్తుతం జపాన్‌ అధ్యక్షత వహిస్తోంది. దాని పదవీ కాలం మే నెలతో అయిపోనుంది. ఇప్పటికే నిర్ణయం జరిగిన మేరకు మే 18న వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత భారత్‌ బాధ్యతలను చేపట్టనుంది.


ఎగ్జిక్యూటివ్‌ బాడీ చైర్‌పర్సన్‌ హోదాలో భారత ప్రతినిధి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌కు కీలక నిర్ణయాల్లో సహాయం, సూచనలు అందిస్తారు. ఇదిలా ఉండగా కొవిడ్‌పై పోరుకు సంబంధించి డబ్ల్యూహెచ్‌వోపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారత్‌ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని ప్రపంచం నుంచి మన్ననలు అందుకుంటోంది. 

Updated Date - 2020-04-24T08:05:36+05:30 IST