కరోనా కాటుకు సౌదీలో భారతీయుడు మృతి!

ABN , First Publish Date - 2020-06-22T19:54:43+05:30 IST

కరోనా కాటుకు సౌదీ అరేబియాలో భారతీయుడు కన్నుమూసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 43ఏళ్ల సునీల్ కుమార్..

కరోనా కాటుకు సౌదీలో భారతీయుడు మృతి!

 కేరళ: కరోనా కాటుకు సౌదీ అరేబియాలో భారతీయుడు  కన్నుమూసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 43ఏళ్ల సునీల్ కుమార్.. ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడే ఓ సంస్థలో పనికి కుదిరాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తీవ్రంగా అనారోగ్యానికి గురైన సునీల్ కుమార్.. వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనాగా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందతూనే సునీల్ కుమార్ శనివారం రోజు కన్నుమూశాడు. ఆయన అంత్యక్రియలు సౌదీలోనే అధికారులు నిర్వమించారు. 


Updated Date - 2020-06-22T19:54:43+05:30 IST