ఇది నా తల్లికి గర్వకారణం: కమలా హారిస్

ABN , First Publish Date - 2020-10-08T21:45:35+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక ఘట్టం బుధవారం రోజు ఆవిష్కృతమైంది. ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్ పెన్స్, కమలా హారిస్ ముఖాముఖిలో పాల్గొన్నారు. కరోనా విజృంభణ సహా ఇ

ఇది నా తల్లికి గర్వకారణం: కమలా హారిస్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక ఘట్టం బుధవారం రోజు ఆవిష్కృతమైంది. ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్ పెన్స్, కమలా హారిస్ ముఖాముఖిలో పాల్గొన్నారు. కరోనా విజృంభణ సహా ఇతర అంశాలపై ఇద్దరూ తమ వాదనలను వినిపించారు. కాగా.. ముఖాముఖి సందర్భంగా డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్.. తన తల్లి శ్యామలా గోపాలన్ హారిస్‌ను గుర్తు చేసుకున్నారు. కమలా హారిస్ మాట్లాడుతూ.. ‘నేను మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. నేను ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నందుకు ఆమె గర్వపడుతుంది. ఇది నా తల్లికి గర్వకారణం. నేను ప్రస్తుతం ఈ స్థితికి చేరుకున్నాను అంటే దానికి కారణం మా అమ్మే. 19ఏళ్లకే ఆమె అమెరికాకు వచ్చారు. 25ఏళ్లకే నాకు జన్మనిచ్చారు. నేను ఇక్కడ కూర్చోవడం ఆమెకు గర్వకారణం అని భావిస్తున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. కమలా హారిస్ డిబేట్‌లో పాల్గొనడానికి కొన్ని గంటల ముందు ఆమె సోదరి మాయ హారిస్.. ట్విట్టర్‌లో తన తల్లి ఫొటోను పోస్ట్ చేశారు. అందులో కమలా హారిస్, మాయ హారిస్ కూడా ఉన్నారు. 


Updated Date - 2020-10-08T21:45:35+05:30 IST