కైలాస దేశ కరెన్సీపై నిత్యానంద కీల‌క ప్ర‌క‌ట‌న !

ABN , First Publish Date - 2020-08-18T13:34:08+05:30 IST

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో కైలాస ద్వీపం పేరుతో ఓ కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన ఆయన ప్రస్తుతం ఆ దేశ కరెన్సీని తయారు చేశామని వెల్లడించారు.

కైలాస దేశ కరెన్సీపై నిత్యానంద కీల‌క ప్ర‌క‌ట‌న !

న్యూఢిల్లీ, ఆగస్టు 17: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో కైలాస ద్వీపం పేరుతో ఓ కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన ఆయన ప్రస్తుతం ఆ దేశ కరెన్సీని తయారు చేశామని వెల్లడించారు. వినాయక చవితి రోజున కైలాస దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. కైలాస దేశ కరెన్సీ సిద్ధమైందని.. స్థానిక అవసరాల కోసం ఒక కరెన్సీ, విదేశాల కోసం మరో కరెన్సీ ఉపయోగిస్తామని ప్రకటించారు. వాటికన్‌ బ్యాంక్‌ తరహాలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కైలాస ఉంటుందని, అందుకు సంబంధించిన ఆర్థిక విధానాలను రూపొందించామని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-08-18T13:34:08+05:30 IST