కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధాని భార్య

ABN , First Publish Date - 2020-03-30T07:25:00+05:30 IST

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం ఆమెను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం ఎంతో బాగుందని

కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధాని భార్య

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం ఆమెను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం ఎంతో బాగుందని, కరోనా నయమైనట్టు డాక్టర్లు నిర్థారించారని సోఫీ చెప్పారు. కరోనా బారిన పడిన సమయంలో తనకు అండగా నిలిచిన, తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. కాగా.. బ్రిటన్‌ నుంచి కెనడాకు వచ్చిన సోఫీకి మార్చి 12న కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను క్వారంటైన్‌కు తరలించారు. అప్పటి నుంచి ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా సెల్ప్ ఐసోలేష్‌న్‌లోనే ఉంటూ వచ్చారు. ఇంట్లో నుంచే ఆయన పాలనను నడిపిస్తూ వచ్చారు. కరోనా నియంత్రణకు సంబంధించి అధికారులతో ఇంటి నుంచే మాట్లాడుతూ వచ్చారు. 14 రోజుల తరువాత కూడా ఆయన ఇంట్లోనే ఉండటానికి నిశ్చయించుకున్నానని శనివారం మీడియాతో తెలిపారు.. ప్రజలెవరూ బయటకు రావద్దని ఆయన కోరారు. కాగా.. కెనడాలో ఇప్పటివరకు 5,425 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 60 మంది మరణించగా.. 466 మంది కోలుకున్నారు. 

Updated Date - 2020-03-30T07:25:00+05:30 IST