జార్జియాలో జో బైడెన్ గెలుపు
ABN , First Publish Date - 2020-11-21T13:32:21+05:30 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జార్జియాలో శుక్రవారం ముగిసింది. సాధారణంగా రిపబ్లికన్లకు మంచి పట్టు ఉండే

వాషింగ్టన్, నవంబరు 20: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జార్జియాలో శుక్రవారం ముగిసింది. సాధారణంగా రిపబ్లికన్లకు మంచి పట్టు ఉండే ఆ రాష్ట్రంలో ఈ సారి డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచారు. 1992 తర్వాత జార్జియాలో విజయం సాధించిన తొలి డెమొక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్ నిలిచారు. జార్జియాలో ఫలితాలపై రిపబ్లికన్లు అభ్యంతరాలు తెలపగా, అక్కడ రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌పై 12,284 ఓట్ల తేడాతో బైడెన్ గెలిచినట్లు తేలింది. దీంతో బైడెన్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 306కి పెరిగింది. ట్రంప్ సాధించిన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 232గా ఉంది. కాగా, కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు దేశంలో మాస్క్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తాం తప్ప.. దేశవ్యాప్త షట్‌డౌన్‌ను విధించబోమని జో బైడెన్ స్పష్టం చేశారు. ఆర్థిక సమయాన్ని మూసివేయడం లేదని, కరోనా వైర్‌సను మాత్రమే మూసివేయబోతున్నానని చెప్పారు.