అధ్యక్ష ఎన్నికల్లో విదేశాల‌ జోక్యంపై బిడెన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

ABN , First Publish Date - 2020-07-22T13:22:49+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా, చైనా, ఇరాన్‌లు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని డెమొక్రటిక్‌ పార్టీ నామినీ జో బిడెన్‌ అన్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో విదేశాల‌ జోక్యంపై బిడెన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యానికి రష్యా, చైనా, ఇరాన్‌ల యత్నం: బిడెన్‌

వాషింగ్టన్‌, జూలై 21: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా, చైనా, ఇరాన్‌లు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని డెమొక్రటిక్‌ పార్టీ నామినీ జో బిడెన్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం నిధులు సేకరించడానికి సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘2016 ఎన్నికల్లో విదేశాలు జోక్యం చేసుకోవడాన్ని మనం చూశాం. ఇప్పుడు కూడా అవి జోక్యం చేసుకునే యత్నాల్లో ఉన్నాయి. మన ఎన్నికల ప్రక్రియలో మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. అలా జరగనివ్వకూడదంటే ఆ దేశాల యత్నాలను బట్టబయలు చేయాలి ’’ అని బిడెన్‌ అన్నారు.  

Updated Date - 2020-07-22T13:22:49+05:30 IST