దేశీయ విధాన మండలి బాధ్యతలను మహిళకు అప్పగించిన జో బైడెన్
ABN , First Publish Date - 2020-12-11T07:07:00+05:30 IST
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన క్యాబినెట్‌లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వెళ్తున్నారు. వైట్‌హౌస్ డొమెస్టిక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన క్యాబినెట్‌లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వెళ్తున్నారు. వైట్‌హౌస్ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ హెడ్‌గా ఆయన ఓ మహిళను నియమించారు. మాజీ అధ్యక్షుడు ఒబామాకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేసిన సూసన్ రైస్‌కు జో బైడెన్ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ హెడ్‌గా అవకాశమిచ్చారు. సూసన్ రైస్ ఒబామాకు సెక్యూరిటీ అడ్వైజర్‌గానే కాకుండా ఐక్యరాజ్యసమితిలో ఆయన రాయబారిగా కూడా పనిచేశారు. విదేశాంగ విధానాలపై ఆమెకు గట్టిపట్టు ఉండటం కారణంగానే పాలసీ కౌన్సిల్ బాధ్యతలను జో బైడెన్ ఆమెకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక సూసన్ రైస్‌తో పాటు అగ్రికల్చర్ సెక్రటరీగా మాజీ గవర్నర్ టామ్ విల్సాక్, సెక్రటరీ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్‌కు డెనిస్ మెక్‌డోనఫ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ హెడ్‌గా మార్సియా ఫడ్జ్, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటెటివ్‌గా క్యాథరిన్ తై నియమితులైనట్టు బైడెన్ ట్రాన్సిషన్ టీమ్ వెల్లడించింది.