గల్ఫ్‌ బాధితులను ప‌ట్టించుకోరా?: ప‌వ‌న్‌

ABN , First Publish Date - 2020-05-17T13:32:29+05:30 IST

మన రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వేలాది మంది గల్ఫ్‌ దేశాలు వెళ్లారు. వారంతా కరోనా మూలంగా అక్కడ చిక్కుకుపోయారు.

గల్ఫ్‌ బాధితులను ప‌ట్టించుకోరా?: ప‌వ‌న్‌

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘మన రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వేలాది మంది గల్ఫ్‌ దేశాలు వెళ్లారు. వారంతా కరోనా మూలంగా అక్కడ చిక్కుకుపోయారు. వారి బాధలు రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు పట్టడంలేదు. అక్కడ చిక్కుకుపోయిన వారి గురించి వారు ఎందుకు కేంద్రంతో మాట్లాడడం లేదు?’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారి బాధలను తప్పకుండా విదేశాంగ శాఖా మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన స్పష్టం చేశారు. శనివారం కడప జిల్లా నాయకులతో, రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్‌  నాదెండ్ల మనోహర్‌తో కలసి పవన్‌  కల్యాణ్‌ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు తన దృష్టికి తీసుకు వచ్చిన అంశాలతో కలిపి ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-05-17T13:32:29+05:30 IST