జాక్ మాకు రెండు నెలల్లో 11 బిలియన్ డాలర్ల నష్టం
ABN , First Publish Date - 2020-12-30T20:44:06+05:30 IST
చైనా టెక్ దిగ్గజం జాక్ మాపై ఆ దేశ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాక్ మా నికర ఆస్తుల విలువ

బీజింగ్: చైనా టెక్ దిగ్గజం జాక్ మాను ఆ దేశ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాక్ మా నికర ఆస్తుల విలువ తగ్గుతూ పోతోంది. అలీబాబా గుత్తాధిపత్యం చలాయిస్తోందనే అనుమానంతో చైనా రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల ఆ సంస్థపై దర్యాప్తును ప్రారంభించాయి. అంతేకాకుండా యాంట్ సంస్థ 35 బిలియన్ డాలర్ల ఐపీఓను సైతం నిలిపివేశాయి. మరోపక్క యాంట్ గ్రూప్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌లను చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రశ్నించింది.
బిజినెస్ రీస్ట్రక్చర్ ప్లాన్ వివరాలను అడిగి తెలుసుకుంది. రెగ్యులేటరీ నిబంధనలను యాంట్ గ్రూప్ అనుసరించడం లేదంటూ సెంట్రల్ బ్యాంక్ మందలించింది. ఈ ప్రభావం జాక్ మా నికర ఆస్తులపై గట్టిగా పడింది. జాక్ మా నికర ఆస్తుల విలువ రెండు నెలల్లో దాదాపు 11 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ఈ ఏడాది 61.7 బిలియన్ డాలర్ల వరకు చేరిన ఆయన సంపద.. గడిచిన రెండు నెలల్లో 50.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది.