యూరప్ వెళ్లొద్దు.. అక్కడివారు రావొద్దు
ABN , First Publish Date - 2020-03-16T10:48:24+05:30 IST
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసి్‌సకూ కరోనా భయం పట్టుకుంది. వైరస్ ప్రబలుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలంటూ.. ఉగ్రవాదులకు
- తమ ఉగ్రవాదులకు ప్రత్యేక సూచనలు
లండన్, మార్చి 15: కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసి్‌సకూ కరోనా భయం పట్టుకుంది. వైరస్ ప్రబలుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలంటూ.. ఉగ్రవాదులకు ప్రత్యేకంగా ప్రయాణ మార్గదర్శకకాలను జారీచేసింది. యూరప్ దేశాలకు వెళ్లరాదంటూ తమ ఉగ్రవాదులకు ఐసిస్ హెచ్చరికలు చేసినట్లు ‘సండే టైమ్స్’ పేర్కొంది. ఇప్పటికే ఉగ్రవాద కార్యకాల పాల కోసం యూర్‌పలో తిష్ఠవేసిన ఉగవ్రాదులను ఆ ప్రాంతాలను విడిచి రావొద్దంటూ హుకుం జారీచేసింది. బయట నుంచి ఉగ్రవాదులెవ్వరూ యూర్‌పలో అడుగుపెట్టడం కానీ.. అక్కడున్నవారెవ్వరూ బయటకు రావొద్దని స్పష్టీకరిస్తూ ‘అల్-నబా’ న్యూస్‌లెటర్‌లో పేర్కొంది. తుమ్ములు, ఆవులింతల సమయాల్లో ప్రత్యేక జాగ్రతలు తీసుకోవాలని.. ఎప్పుడూ మాస్క్‌లు ధరించాలని సూచించింది.