బురఖా వేసుకోకుండా రోడ్డు మీదకు వచ్చినందుకు యువతి అరెస్ట్
ABN , First Publish Date - 2020-10-21T09:15:05+05:30 IST
ఇరాన్లో ఓ యువతి బురఖా ధరించనందుకు ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని నజఫాబాద్ గవర్నర్

టెహ్రన్: ఇరాన్లో ఓ యువతి బురఖా ధరించనందుకు ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని నజఫాబాద్ గవర్నర్ మోజాటబా రేయి వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించి మతాన్ని అవమానపరచిన యువతి అరెస్ట్ అయినట్టు ఆయన తెలిపారు. యువతి ఇలా చేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌లోని మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. యువతి నజఫాబాద్లోని ఓ మసీదు ఎదుటే బురఖా లేకుండా సైక్లింగ్ చేసింది. బురఖా లేని యువతిని చూసి స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. బురఖా ధరించని యువతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో కాస్తా వైరల్ అయిపోయింది. యువతికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేయడం కూడా మొదలుపెట్టేశారు. కాగా.. ఇరాన్ చట్టం ప్రకారం మహిళలు బురఖా తప్పనిసరిగా ధరించాలి.