అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువు పెంపు
ABN , First Publish Date - 2020-08-01T14:08:46+05:30 IST
అంతర్జాతీయ విమానాల సర్వీసుల రద్దు గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం ప్రకటించింది.

న్యూఢిల్లీ, జూలై 31: అంతర్జాతీయ విమానాల సర్వీసుల రద్దు గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం ప్రకటించింది. కరోనా కారణంగా విమానాల రద్దు గడువును జూలై 31 వరకు విధించగా.. తాజాగా దాన్ని పొడిగించింది. అంతర్జాతీయ కార్గో విమానాలు మాత్రం యథావిధిగా నడుస్తాయని డీజీసీఏ పేర్కొంది.