భారత్ చర్యలు భేష్: ది న్యూయార్క్ టైమ్స్
ABN , First Publish Date - 2020-03-25T22:24:28+05:30 IST
కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. చైనాలో ఉద్భవించిన కరోనా.. క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య రోజురో

వాషింగ్టన్: కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. చైనాలో ఉద్భవించిన కరోనా.. క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 4.25లక్షల మంది దీని బారినపడగా.. 19వేల మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు... ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. అంతేకాకుండా 21రోజులపాటు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ దినపత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టిడికి భారత ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయాన్ని సమర్థించింది. అంతేకాకుండా.. అగ్రరాజ్యం అమెరికాలో లాక్‌డౌన్ ప్రకటిస్తే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అమెరికాలో 55 వేల మంది కొవిడ్-19 బారినపడగా.. 784 మంది మరణించారు. ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌కు మొగ్గచూపుతున్న వేళ.. ట్రంప్ కూడా లాక్‌డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. ఒకవేళ అమెరికాలో లాక్‌డౌన్ ప్రకటిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అభిప్రాయపడ్డారు. కరోనాతో కంటే.. లాక్‌డౌన్ వల్లే ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ దినపత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ భారత ప్రభుత్వ చర్యను అభినందించడం ఆసక్తిగా మారింది.