మస్కట్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు..

ABN , First Publish Date - 2020-10-07T14:25:28+05:30 IST

భారత్, ఒమన్ మధ్య ఇటీవల ఎయిర్ బబుల్ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య విమానాల రాకపోకలకు మార్గం సుగమైంది.

మస్కట్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు..

మస్కట్: భారత్, ఒమన్ మధ్య ఇటీవల ఎయిర్ బబుల్ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య విమానాల రాకపోకలకు మార్గం సుగమైంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. దీనిలో భాగంగా ఇండియన్ బడ్జెజ్ క్యారియర్ ఇండిగో తాజాగా ఒమన్ నుంచి భారత్‌కు విమానాలు నడిపేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 7 నుంచి ఈ విమాన సర్వీసులు ఉంటాయని ప్రకటించింది.


మస్కట్ నుంచి భారతదేశంలోని ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబై, హైదరాబాద్, కొచ్చికు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలు నడపనుంది. ఒమనీ నేషనల్స్, ఒమన్ రెసిడెంట్ కార్డ్ హోల్డర్లను కూడా ఇండియా నుంచి ఒమన్ తీసుకెళ్తామని ఇండిగో ప్రకటించింది. అయితే, ఒమన్ వెళ్లే ప్రతి ప్రయాణికుడికి పీసీఆర్ టెస్టు తప్పనిసరి అని తెలిపింది. 


ఇక ఒమన్ నుంచి భారత్‌కు వచ్చే సర్వీసుల్లో కేవలం ఆ దేశంలో చిక్కుకున్న భారత ప్రవాసులు, ఒమన్ పాస్‌పోర్టు కలిగి ఉన్న ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), దౌత్యవేత్తలు, ఒమనీ జాతీయులను తరలించనున్నట్లు ఇండిగో పేర్కొంది.    

Read more