కువైత్‌లో పెరుగుతున్న ‘కరోనా భారతీయులు’

ABN , First Publish Date - 2020-04-05T08:28:56+05:30 IST

కువైత్‌లో కరోనా సోకిన భారతీయుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుండటంపై అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. శనివారం వరకు నమోదయిన

కువైత్‌లో పెరుగుతున్న ‘కరోనా భారతీయులు’

(గల్ఫ్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి): కువైత్‌లో కరోనా సోకిన భారతీయుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుండటంపై అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. శనివారం వరకు నమోదయిన 479 కేసులలో భారత్‌కు చెందిన 148 మంది ఉన్నారు. అక్కడ తొలి మరణం కూడ భారతీయుడిదే కావడంతో కలవరం రేగుతుంది. భారతీయులు ఇరుకైన గదులలో ఉండటంతో వ్యాధి శరవేగంగా వ్యాపిస్తోందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిపై కువైత్‌ విదేశీ వ్యవహారాల మంత్రి షేఖ్‌ అహ్మద్‌ నాసర్‌ అల్‌ సభా మన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. వీలయినంత త్వరగా ప్రత్యేక విమానాలను అనుమతించాలని కోరినట్లు సమాచారం. మహ్బులలో 540 మంది భారతీయులు నివసించే కార్మిక క్యాంపులో వ్యాధి సోకిన ఒకరిని క్వారంటైన్‌ చేశారు. ఆ తర్వాత పరీక్షించగా మరికొంతమందిలోనూ పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారందరినీ రెండు ప్రత్యేక ఆసుపత్రులకు తరలించారు. 

Updated Date - 2020-04-05T08:28:56+05:30 IST