కరోనా కల్లోలం.. పెద్ద మనసు చాటుకున్న ఎన్నారైలు!

ABN , First Publish Date - 2020-03-30T18:20:03+05:30 IST

కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా వైరస్ విజ‌ృంభిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు 1.40లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇటు భారత్‌

కరోనా కల్లోలం.. పెద్ద మనసు చాటుకున్న ఎన్నారైలు!

వాషింగ్టన్: కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా వైరస్ విజ‌ృంభిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు 1.40లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇటు భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. కరోనా కాటుకు ఇండియాలో ఇప్పటి వరకు 27 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్రవాసులు తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా సేవా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ దాదాపు రూ. రెండు కోట్ల విరాళాలను సేకరించింది. ఈ మొత్తాన్ని కరోనా ప్రభావం అత్యధిక ఉన్న ప్రాంతాల్లో.. ప్రజలకు మాస్కులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఖర్చు చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఎన్. శ్రీనాథ్ వెల్లడించారు. అంతేకాకుండా సంస్థ ఆధ్వర్యంలో సుమారు 500 మందితో వలంటరీ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ టీమ్‌లోని సభ్యులు.. కరోనా బాధితుకు, వైద్యులకు సహాయసహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. 


ఇదిలా ఉంటే.. కరోనాపై భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా.. న్యూయార్క్‌లో స్థిరపడ్డ కేకే అండ్ చంద్ర మెహతా దంపతులు ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. వారి సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌లో కరోనా కట్టడికి తమ వంతు సాయం చేస్తున్న పోలీసులకు ఆహార పొట్లాలు అందించడానికి రూ. 11లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఫ్లోరిడాలో ఉంటున్న చంద్రకాంత్ పటేల్ కూడా తన సొంత రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్‌లోని సుమారు 300 నిరుపేద కుటుంబాలకు ఆహారపదార్థాలు అందిస్తున్నట్లు చెప్పారు. 


సిక్కు గురుద్వార్, సిక్కు ఆర్గనైజేషన్‌కు సంబంధించిన సభ్యులు.. అమెరికాల్లోని పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి, ఇళ్లు లేని పేదలకు, ఆసుపత్రి సిబ్బందికి ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. 


Updated Date - 2020-03-30T18:20:03+05:30 IST